అక్కినేని నాగచైతన్య హీరోగా చేసిన తండేల్ మూవీ భారీ హిట్ కొట్టడంతో ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ ని హైదరాబాద్ లో గ్రాండ్ గా చేశారు.అయితే ఈ సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్ తో పాటు నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున, నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ్ల వచ్చి సందడి చేశారు.ఇక స్టేజ్ మీద నాగార్జున తన కొడుకు సినిమా గురించి మాట్లాడుతూ పుత్రోత్సాహంతో పొంగిపోయారు. ఇక నాగార్జున మాట్లాడుతున్న మాటలకు శోభిత చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అలాగే నాగార్జున తండేల్ మూవీ గురించి మాట్లాడుతూ మా కోడలు వచ్చిన వేళా విశేషం.. అల్లు అరవింద్ గారు కథ విన్న వేళా విశేషం..చందు మొండేటిని దీనికి డైరెక్టర్గా తీసుకున్న వేళా విశేషం.. చైతు ని హీరోగా తీసుకున్న వేళా విశేషం ఏమో కానీ నాగచైతన్య ఖాతాలో మంచి హిట్టు పడింది. 

100 కోట్ల సినిమా క్లబ్లో అల్లు అరవింద్ ఈ సినిమాతో చేరారు. ఇక అల్లు అరవింద్ మాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, 100% లవ్,తండేల్ వంటి మూడు సినిమాలను అందించారు. ఈ సినిమాలతో అక్కినేని అల్లు ఫ్యామిలీ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.ఈ సినిమా హిట్ అయినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం.. అంటూ అక్కినేని నాగార్జున ప్రసంగించారు.అయితే ఆయన స్టేజ్ మీద మాట్లాడే ముందు ఆయనకు సంబంధించిన ఒక ఏవి స్క్రీన్ మీద వేశారు.

 అయితే ఈ ఏవి చూసిన నాగార్జున కోడలు కొడుకు ముందు ఇలాంటి వీడియోలు చూపించకండయ్యా అంటూ అక్కడ ఉన్న వారిని నవ్వించేసారు.. ఎందుకంటే ఆ ఏవీ లో నాగార్జున సినిమాలకు సంబంధించి అలాగే అందులో నాగార్జున హీరోయిన్లతో చేసిన రొమాన్స్ ని కూడా చూపించారు.అందుకే రొమాంటిక్ వీడియోలను కొడుకు కోడలు ముందు చూపించి పరువు తీయడం ఎందుకు అన్నట్లుగా నాగార్జున మాట్లాడారు. ప్రస్తుతం నాగార్జున మాటలు నెట్టింట వైరల్ గా మారాయి

మరింత సమాచారం తెలుసుకోండి: