ఏంటి చిరంజీవి తనకి మనవడు కావాలని కొడుకు రామ్ చరణ్ ని అంత టార్చర్ చేస్తున్నాడా.. ఇంతకీ ఎందుకు చిరంజీవి అలాంటి డెసిషన్ తీసుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం..చిరంజీవి తాజాగా బ్రహ్మానందం నటించిన బ్రహ్మా ఆనందం అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అయితే  ఈ ఈవెంట్లో స్టేజ్ మీద చిరంజీవి మాట్లాడుతూ.. మా తాత మంచి రసికుడు..ఆయనకు నాకు తెలిసి నలుగురైదుగురు ఉన్నారు కావచ్చు. ఒకరి మీద అలిగితే మరొకరి దగ్గరికి వెళ్లేవాడు. అయితే మా అమ్మ ఎప్పుడూ చెప్పేది నువ్వు మా నాన్నలా తయారవ్వద్దురా అని.. అయితే నాకు మా తాత అలవాట్లు రాలేదు కానీ ఆయన దానగుణం మాత్రం వచ్చింది. ఆయన ఎంతోమందికి దానం చేసేవారు. ఇక మా ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు లేడీస్ హాస్టల్ లా కనిపిస్తుంది. నేను ఆ లేడీస్ హాస్టల్ లో వార్డెన్ లా ఊహించుకుంటాను.

ఎందుకంటే మా ఇంట్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు. రామ్ చరణ్ కైనా కొడుకు పుడతాడు అనుకుంటే వాడికి కూడా కూతురు పుట్టింది. ఇక ఇక్కడితో అమ్మాయిలు చాలని నెక్స్ట్ రామ్ చరణ్ ని కొడుకు పుట్టాలి అని అడిగాను. కానీ వాడికి అమ్మాయిలు అంటేనే బాగా ఇష్టం.కాబట్టి మళ్ళీ అమ్మాయి పుడుతుంది కావచ్చు అని భయంగా ఉంది. ఇక మెగా ఫ్యామిలీ లెగసీని కాపాడాలంటే ఒక్క అబ్బాయ్ అయినా ఉండాలి కదా..అందుకే రామ్ చరణ్ కి బాబు పుట్టాలని నేను అనుకుంటున్నాను.. నాకు మనవడే కావాలి అని నేను రామ్ చరణ్ కి చెబుతాను అంటూ చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారు. ప్రస్తుతం చిరంజీవి మాటలు విన్న నెటిజన్స్ చిరంజీవి చెప్పింది నిజమే..

ఎందుకంటే ఇప్పటివరకు మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవి కూతుర్లకి, కొడుకుకి ఒక్కరికి కూడా అబ్బాయి పుట్టలేదు.పెద్ద కూతురికి ఇద్దరు కూతుర్లే.. చిన్న కూతురికి కూడా ఇద్దరూ కూతుర్లే.. ఇక రాంచరణ్ కైనా కొడుకు పుడతారు అనుకుంటే ఆయనకి కూడా క్లింకార పుట్టింది. ఇక నెక్స్ట్ టైమ్ అయినా రామ్ చరణ్ కి బాబు పుట్టక పోతే చిరంజీవి వంశం అక్కడితో ఆగిపోతుంది అనే భయం లో చిరంజీవి ఉన్నారని ఆయన మాటలు విన్న నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.. మరి నెక్స్ట్ టైం రామ్ చరణ్ ఉపాసనలకు బాబు పుడతాడు లేక మళ్ళీ కూతురే పుడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: