ఈ మధ్యకాలంలో బన్నీ సడన్ ట్విస్ట్ లు ఎక్కువగా ఇస్తున్నాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . రీసెంట్ గానే సోషల్ మీడియాలో బన్ని పేరు పై దారుణాతి దారుణంగా ట్రోలింగ్ జరిగే పరిస్థితి వచ్చి..చేతులు దాటిపోయే రేంజ్ కి వెళ్ళిపోయిందో మనకు తెలిసిందే.  ఇప్పుడిప్పుడే పరిస్థితి కంట్రోల్ లోకి వస్తుంది . మళ్ళీ బన్నీ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది . ఇప్పుడిప్పుడే బన్నీ కూడా బయట ప్రపంచానికి కనిపిస్తున్నాడు . రీసెంట్గా పుష్ప సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొని తనదైన స్టైల్ లో స్పీచ్ ఇచ్చి ఆకట్టుకున్నాడు.


కాగా అల్లు అర్జున్ కి సంబంధించిన వార్తలు మరొకసారి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారుతున్నాయి. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే . నిజానికి ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి రావాల్సింది . కానీ కొన్ని అనివార్య కారణాల చేత ఆలస్యం అయింది . అయితే రేపో మాపీ ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది అనుకున్న మూమెంట్లో ఫ్యాన్స్ గుండెలు బద్దలై పోయే న్యూస్ బయటకు వచ్చింది.



త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో బన్నీ మూవీకి కమిట్ అయినా వార్త నిజమే . కానీ ఆ సినిమాని హోల్డ్ లో పెట్టి వేరొక డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడు బన్నీ అంటున్నారు జనాలు . ఆయన మరెవరో కాదు డైరెక్ట్ అట్లీ . ఎస్ గత మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో డైరెక్టర్ అట్లీ హీరో అల్లు అర్జున్ పేర్లు ఎలా మారుమ్రోగిపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. మరీ ముఖ్యంగా పుష్ప లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత మళ్లీ బన్నీకి అలాంటి హిట్ పడాలి అంటే పాన్ ఇండియా మూవీ అయి ఉండాలి అని ..ఆ కారణంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సినిమాని పక్కనపెట్టి అట్లీకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని ..రీసెంట్ గానే అట్లీ టీం హైదరాబాద్ కి వచ్చి అల్లు అర్జున్ ని స్పెషల్ గా కలిసి సినిమాకి సంబంధించిన పనుల గురించి మాట్లాడారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇది అల్లు అర్జున్ అభిమానులకు హ్యాపీగానే ఉన్న త్రివిక్రమ్ ఫ్యాన్స్ కి మాత్రం హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని అంటున్నారు జనాలు . చూద్దాం మరి దీనిపై అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: