టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా గుర్తింపు సాధించడం అంత సులువు కాదు. కానీ చాలామంది హీరోయిన్లు ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని రాణిస్తున్నారు. హీరోలతో పాటుగా పోటీ పడుతూ.. వారి అందం, అభినయంతో అందరి మనసు దోచుకుంటున్నారు. అయితే కొందరు హీరోయిన్లు కేవలం యాక్టింగ్, డ్యాన్స్ పైన మాత్రమే ఫోకస్ పెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. మరికొందరు హీరోయిన్లు మాత్రం నటన, నాట్యంతో పాటుగా ఇతర వాటిలోనూ నైపుణ్యం సాధించుకుంటారు. అయితే ఆ అందాల భామలకు నటనతో పాటుగా ఉన్న హిడెన్ టాలెంట్స్ ఏంటో తెలుసుకుందాం.
బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ చిన్న చిన్న సినిమాలో నటిస్తూ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ తో పాటు ఈమె బాలీవుడ్ లో కూడా సినిమాలు తీసింది. తన అందం అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే ఈమె సినిమాలో యాక్ట్ చేయడమే కాదు.. ఇంకో టాలెంట్ కూడా ఉంది అంట. రకుల్ గోల్ఫ్ క్రీడాకారిణి అంట, ఈమె రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా పాల్గొన్నారు. సినిమాలోకి వచ్చాక ఆపేశారంట కానీ అప్పుడప్పుడు ఆడుతారు. గ్లామరస్ భామ కీర్తి సురేష్ ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈమె నటనతో పాటు ఫ్యాషన్ డిజైనింగ్‍ కూడా నేర్చుకుంది అంట. ఈమెకి ఫ్యాషన్ డిజైనింగ్‍ తో పాటు ఈమె పెయింటింగ్ కూడా బాగా వేస్తుంది అంట. అలాగే స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక మోడల్ అని మనకి తెలుసు. తాను నటి అని కూడా తెలుసు, కానీ తాను ఒక భారతనాట్యం డ్యాన్సర్ కూడా. ఆమె 10 ఏళ్ల పాటు నాట్యం శిక్షణ తీసుకుంది అంట. అలాగే ఈమెకి సంప్రదాయ సంగీతం కూడా వచ్చు అంట.
ఇక క్యూట్ గా కనిపించి కుర్రలను తనవైపుకి తిప్పుకునే రాశి ఖన్నాకు కూడా నటనతో పాటుగా మరో హిడెన్ టాలెంట్ ఉంది అంట. ఈమె చాలా చక్కగా పాటలు పడుతుంది. చాలా సినిమాలలో కూడా ఈమె ఒక ప్రొఫెషనల్ సింగర్ లా పడింది. బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ అభినయంయే కాదు మిమిక్రీ కూడా అదరగొడుతుంది. ఆమె తన గొంతును మార్చి రకరకాలుగా మాట్లాడగలదు అంట.

మరింత సమాచారం తెలుసుకోండి: