టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ నటించిన లైలా సినిమా చుట్టూ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈవెంట్ సందర్భంగా... 30 ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృథ్వీరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసిపి నేతలను గెలికి... అనవసరంగా హీరో విశ్వక్ నటించిన లైలా సినిమాను వివాదంలోకి లాగారు పృధ్విరాజ్. అయితే ఈ వివాదం తారస్థాయికి చేరినప్పటికీ.... పృధ్వి రాజు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆసుపత్రి పాలైన పృథ్విరాజ్... మరోసారి వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ పై రెచ్చిపోయి మాట్లాడారు.


 నోటికి వచ్చిన బూతులతో మండిపడ్డారు. అమ్మనా బూతులు తిట్టారు పృధ్విరాజ్. సినిమాను సినిమా లాగా చూడాలని... రాజకీయాల్లోకి లాగొద్దంటూ.. వైసిపి నేతలను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు పృథ్వీరాజ్. ఆసుపత్రి బెడ్ పైన పడుకొని మాట్లాడుతూ.... అనవసరంగా తన తల్లిని ఈ విషయంలోకి లాగారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. ల*** భాష  తో వైసిపి నేతలను ఉద్దేశించి పచ్చి బూతులు తిట్టారు పృధ్విరాజ్.

 వైసిపి నేతలకు 11 అనే పేరు చెప్పగానే వణుకు పుడుతుందని చురకలాంటించారు. అసలు 11 అనే పదం... అంటే మీకేం నొప్పి అంటూ రెచ్చిపోయారు. అయితే పృథ్వీరాజ్ నిన్న రాత్రి చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. అదే సమయంలో హీరో విశ్వక్ కూడా.. మరోసారి వైసీపీ నేతలకు మండేలా ఒక పోస్ట్ పెట్టారు. తన మిడిల్ ఫింగర్ చూపిస్తూ... పోస్ట్ పెట్టారు హీరో విశ్వక్.

 దీంతో లైలా సినిమాను కచ్చితంగా బ్యాన్ చేస్తామని సోషల్ మీడియాలో వైసిపి నేతలు పోస్టులు పెడుతున్నారు. ఇక నీ సినిమా పని అయిపోయింది రా విశ్వక్... అంటూ తెగేసి చెప్పేస్తున్నారు. Lకచ్చితంగా ఫిబ్రవరి 14వ తేదీన... లైలా సినిమాను ఆగం చేస్తామని వైసిపి నేతలు సోషల్ మీడియాలో మళ్లీ పోస్టులు పెడుతున్నారు. హెచ్డి ప్రింట్ కూడా రిలీజ్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. ఇక అటు హీరో విశ్వక్ కోసం రంగంలోకి... నందమూరి అభిమానులు కూడా దిగారు.


మరింత సమాచారం తెలుసుకోండి: