సినీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్లు తొందరగా పెళ్లి చేసుకోరు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటే కెరీర్ కి టైమ్ ఇవ్వలేమని ఆగిపోతారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ లు అయితే అసలు చేసుకోరు. పెళ్లి చేసుకుంటే ఫ్యామిలికి టైమ్ ఇవ్వలేమని హీరోలు.. పెళ్లి చేసుకుంటే డిమాండ్ తగ్గిపోద్దని, ఆఫర్స్ రావని అని హీరోయిన్ లు చేసుకోరు. అయితే కొంత మంది హీరోలు పెళ్లి చేసుకున్న ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి వాళ్లు పెళ్లి చేసుకున్న తర్వాత తీసిన ఫస్ట్ మూవీ ఏంటో చూద్దాం.
మొదటగా సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా మోత మొగిపోయే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత తీసిన మొదటి సినిమా కొమరం పులి. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు అందం గురించి ఎంత మాట్లాడిన తక్కువే. ప్రిన్స్, నమ్రత శిరోద్కర్ ని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రిలీజ్ అయిన అతడు సినిమా హిట్ కొట్టింది. ఇక మెగా హీరో రామ్ చరణ్, ఉపాసన కమినేనిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తీసిన నాయక్ సినిమా సూపర్ హిట్ కొట్టింది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తెరకెక్కిన ఊసరవెల్లి సినిమా యావరేజ్ గా ఆడింది. అలాగే ఐకన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ప్రేక్షకుల ముందుకి వచ్చిన బద్రీనాథ్ సినిమా ఫ్లాప్ అయింది.
న్యాచురల్ స్టార్ నాని, అంజనా యాలవర్తిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అతను తీసిన పైసా సినిమా ఫ్లాప్ అయింది. మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తెరపైకి వచ్చిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ పెద్ద డిజాస్టర్ గా అయింది. ఇక హీరో టాలీవుడ్ నటుడు నితిన్ కరోనా టైమ్ లో షాలిని కందుకూరిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన చెక్ సినిమా పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. హీరో నిఖిల్ కూడా కరోనా టైమ్ లోనే పల్లవి వర్మ ని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత తీసిన కార్తికేయ 2 సినిమా నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాగే అక్కినేని హీరో నాగ చైతన్య మొదట సమంతని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత తీసిన శైలజారెడ్డి అల్లుడు సినిమా యావరేజ్ గా ఆడింది. తర్వాత సమంతతో విడాకులు తీసుకొని శోభిత ధూళిపాళని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు తీసిన తండేల్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: