ప్రభాస్.. అంటే చాలా చాలా మంది అమ్మాయిలకి ఇష్టం. హీరోయిన్స్ కి అయితే ప్రాణం . ప్రభాస్ కోసం ఏమైనా చేస్తారు.. ఎలాంటి సీన్స్ లోనైనా నటిస్తారు . కొంతమంది ముద్దుగుమ్మలు రెమ్యూనరేషన్ తీసుకోకుండా కూడా మేము ప్రభాస్ సినిమాలో నటిస్తామంటూ ఓపెన్ గానే ముందుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి . అయితే ప్రభాస్ మాత్రం ఏ హీరోయిన్ విషయంలో అలా ముందుకు వెళ్లడు . సినిమా అంటే సినిమాగానే చూస్తాడు. ఫ్రెండ్ షిప్ అంటే ఫ్రెండ్షిప్ గానే చూస్తాడు .


అయితే సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ ఎంతో మంది హీరోయిన్స్ తో నటించిన.. స్పెషల్ కాంబో మాత్రం అనుష్కతోనే అని చెప్పాలి . వీళ్లిద్దరిని హీరో హీరోయిన్లుగా కాదు ఫ్రెండ్స్ గా కాదు భార్య భర్తలు గానే  స్క్రీన్ పై చూస్తూ ఉంటారు ఫ్యాన్స్.  వాళ్ళు మా మధ్య ప్రేమ లేదురా బాబోయ్ అనుకున్న కూడా మీ మధ్య ప్రేమ ఉంది అనే విధంగానే ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు.  అంత ఇష్టం జనాలకి ప్రభాస్ - అనుష్కల జంట అంటే . వీళ్ళ కాంబోలో సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.



మరీ ముఖ్యంగా వీళ్ళ కాంబోలో వచ్చిన  సినిమాలు వేరే లెవెల్ అని చెప్పాలి . అయితే ఈ సినిమా కోసం అనుష్క భారీ ఆఫర్ ని వదులుకుందట.  ఈ సినిమాకి కాంపిటీటివ్గా మరొక సినిమాలో కూడా అనుష్కకు ఆఫర్ వచ్చిందట.  ఆ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ కూడా ఇస్తాము అన్నారట . కానీ ప్రభాస్ తో నటించాలి అనే కారణంగా అనుష్క ఆ ఆఫర్ ని వదిలేసి తక్కువ రెమ్యూనేషన్ ఇచ్చిన ఈ ఆఫర్ ని ఓకే చేసిందట . ఈ విషయం ప్రభాస్ కి కూడా తెలుసు . అప్పట్లో ఈ వార్త బాగా హైలైట్ గా మారింది . ఇలాంటి పనులు చేయడం వల్లనే ప్రభాస్ - అనుష్కల మధ్య ఏదో ఉంది అన్న పుకార్లు ఎక్కువగా వినిపించాయి . అసలు వీళ్ళు పెళ్లి చేసుకుంటారా..? చేసుకోరా..? ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ..? వేచి చూడాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి: