టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి మంచ్ గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీ సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. పెళ్లి తర్వాత నాగచైతన్యకు తండేల్ రూపంలో భారీ విజయం దక్కింది. తండేల్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో అద్భుతాలు చేస్తోంది. తండేల్ మూవీ సాధిస్తున్న కలెక్షన్లు చూసి చైతన్య అభిమానులు సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు.
 
అయితే సోషల్ మీడియాలో మాత్రం శోభిత చైతన్యను పట్టించుకోవడం లేదని కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. చైతన్యకు ఈ విధంగానే జరగాలి అంటూ మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే చైతన్య శోభిత ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చైతన్య శోభిత మధ్య ఎలాంటి గ్యాప్ లేకపోయినా కొంతమంది కావాలని ఈ తరహా వార్తలు ప్రచారం చేస్తూ గ్యాప్ క్రియేట్ చేస్తున్నారని చెప్పాలి.
 
చైతన్య శోభిత కలిసి నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ కోరిక తీరడానికి కొంత సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. తండేల్ మూవీ సక్సెస్ తో చైతన్య పారితోషికం భారీ స్థాయిలో పెరిగే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. టాలీవుడ్ హీరో నాగచైతన్య రేంజ్ అంతకంతకూ పెరుగుతోందని చెప్పవచ్చు. సరైన ప్రాజెక్ట్స్ ను ఎంచుకోవడం ఈ హీరో సక్సెస్ కు కారణమవుతోంది.
 
రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో చైతన్య ప్రేక్షకుల ముందుకు రానున్నారని సమాచారం అందుతోంది. తండేల్ సినిమా సక్సెస్ గీతా ఆర్ట్స్ కు సైతం ప్లస్ అయింది. నాగచైతన్య గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాల్లో నటించే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. నాగచైతన్య 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. చైతన్య కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. నాగచైతన్య రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.


 
 
 
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: