సాధారణంగా మన గురించి ఎవరైనా ఇతరులు తప్పుగా చెప్తేనే మనకెంతో కోపం వస్తుంది..అలాంటిది మన దాంపత్య జీవితంలో వేలు పెట్టి  తప్పుగా క్రియేట్ చేస్తే మనిషికి ఇంకెంత మండుతుందో  పెళ్లయిన దంపతులకు మాత్రమే తెలుసు.. అది సాధారణ మనుషులైన పెద్ద పెద్ద స్టార్స్ అయినా సరే దాంపత్య జీవితం వారి మద్య ఉండేటువంటి ప్రేమానురాగాలు గొడవలు అనేవి ఒకే విధంగా ఉంటాయి..అలాంటి దాంపత్య జీవితంలో కలంకాలు సృష్టిస్తే తప్పకుండా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. ముఖ్యంగా హీరో హీరోయిన్లకు సంబంధించి  చిన్న రూమర్ బయటకు వచ్చిన అది చిలువలు పలువలుగా మారి పెద్దపెద్ద గొడవలకు దారితీస్తుంది.. అలా సైఫ్ అలీ ఖాన్ కరీనాకపూర్ గురించి తాజాగా ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

 ఈ పోస్టులో ఏం అర్థం ఉందో, అర్థం చేసుకోకుండా  కొంతమంది వ్యక్తులు వారు విడాకులు తీసుకొని విడిపోతున్నారని వార్తలు క్రియేట్ చేశారు.. మరి దీని వెనుక ఉన్నదేంటో ఇప్పుడు చూద్దాం.. అయితే ఈ మధ్యకాలంలో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఒక దుండగుడు ఆయనపై కత్తితో దాడి చేశాడు. దీంతో సైఫ్ అలీ ఖాన్ కొద్దిరోజులపాటు ఆసుపత్రిలో ఉండి ఈ మధ్యనే కోలుకున్నాడు.. ఇదే తరుణంలో కరీనాకపూర్  సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక విషయాన్ని బయట పెట్టింది.." వివాహాలు, విడాకులు, చిల్డ్రన్స్ ,  టెన్షన్స్, ప్రేమించిన వ్యక్తి చనిపోవడం, పిల్లల కేరింగ్.. ఇవన్నీ మీకు జరిగే వరకు ఎప్పటికి అర్థం కావు.. లైఫ్ లో జరిగే కొన్ని సిద్ధాంతాలు, అంచనాలు, వాస్తవాలు కావు.. ఈ సమస్యలు అనేవి మీ వరకు వచ్చి మీ జీవితం మార్చే వరకు, సమస్య పరిస్థితి ఏంటో అర్థం కాదు.

ఇది ప్రతి ఒక్కరికి అనుభవం అయ్యేవరకు, ఇతరుల కంటే మనం తెలివైన వాళ్ళమే అని అనుకుంటాం.. అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా రాసుకొచ్చింది.. అయితే రీసెంట్ గా కత్తి దాడి జరిగిన సమయంలో సైఫ్ అలీఖాన్ పనిమనిషితో ఏకాంతంగా ఉండడం వల్లే పనిమనిషి ప్రియుడు ఆయనపై కత్తితో అటాక్ చేసినట్టు ఓ రూమర్ వినిపించింది. ఇక ఇది నిజమే అన్నట్లుగా కరీనాకపూర్ విడాకుల వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఈ విధంగా కరీనా అనుకోకుండా ఈ సందేశం ఇవ్వడంతో ఆమెకు వచ్చిన బాధ ఏంటి , సైఫ్ అలీ ఖాన్ తో ఈమె విడాకులకు తీసుకోబోతుందా అంటూ ఒక వార్త క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. దీంతో ఇది విపరీతంగా వైరల్ అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: