టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ మరో 48 గంటల్లో లైలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ మొదలు కాగా కొన్ని ఏరియాలలో ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉన్నాయి. లైలా సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్న నేపథ్యంలో విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
 
నా సినిమాకు సంబంధించిన ప్రతి పోస్టర్ నా సినిమాకు సంబంధించింది మాత్రమేనని విశ్వక్ సేన్ తెలిపారు. సినిమాల పోస్ట్ లను, పోస్టర్లను షేర్ చేసే ప్రతిసారి రెండుసార్లు ఆలోచించలేనని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. లైలా పోస్టర్ లో ఉన్నది సోనూ మోడల్ అని ఫిబ్రవరి 14వ తేదీన మీ ముందుకు వస్తున్నాడని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు. బాయ్ కాట్ లైలా హ్యాష్ ట్యాగ్ గురించి మాట్లాడుతూ నేను ప్రతిసారి తగ్గనని పేర్కొన్నారు.
 
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన దానికి నిన్న మనస్పూర్తిగా క్షమాపణలు చెప్పానని విశ్వక్ సేన్ కామెంట్లు చేశారు. అతిగా ఆలోచించవద్దని ప్రశాంతంగా ఉండండని మళ్లీ చెబుతున్నానని నేను నటుడిని మాత్రమేనని నన్ను నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. లైలా కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తుందో నిరాశకు గురి చేస్తుందో చూడాల్సి ఉంది.
 
విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. విశ్వక్ సేన్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా ఈ హీరో కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. లైలా సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రం విశ్వక్ సేన్ కెరీర్ కు ఊహించని స్థాయిలో ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. విశ్వక్ సేన్ ను అభిమానించే వాళ్లు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.  విశ్వక్ టాప్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: