![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/raviteja-latest-phtos-viral-fans-shock8c78db24-bd90-404f-bb86-c3e797de9929-415x250.jpg)
ఒకప్పుడు రవితేజకు భారీ ఇమేజ్ ఉండేది రవితేజ సినిమా వస్తోందంటే చాలు అభిమానులు రచ్చ రచ్చ చేస్తూ ఉండేవారు. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలతో అలరిస్తున్న రవితేజ.. ప్రస్తుతం కొత్త డైరెక్టర్ తో మాస్ జాతర అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే గోపీచంద్ మల్లినేనితో మరొక సినిమా చేయబోతున్నారట. రవితేజకు సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
రవితేజ లుక్స్ అభిమానులకు షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. అసలు గుర్తుపట్టలేనంతగా చాలా బక్క చిక్కిపోయినట్టు కనిపిస్తున్నారు. అలాగే రవితేజ ముఖంలో కూడా చాలా తేడా కనిపిస్తున్నదని నిద్రలేచిన వెంటనే దిగిన ఫోటోల ఉందంటూ పలువురు నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఫోటో అలానే దిగిందా లేకపోతే ఎలా అన్నది తెలియదు కానీ గతంలో కంటే రవితేజ చాలా చర్మం లోపలికి అతుక్కుపోయినట్టుగా కనిపిస్తోంది.. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ ఉన్నది. మొత్తానికి రవితేజ అనే కాకుండా ఆయన కుమారుడు కూడా త్వరలోనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి మొత్తానికి రవితేజ సినిమాలలో లుక్స్ విషయంలో ఏవైనా మార్పు కనిపిస్తాయేమో చూడాలి మరి.