![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/upasanad731cfec-c6f4-4b46-99a2-9cc8406b813e-415x250.jpg)
అంతేకాదు సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ని కూడా ముందే చదివేస్తుంది ఉపాసన అంటూ ఎప్పటినుంచో మెగా ఫాన్స్ మాట్లాడుకుంటూ వచ్చారు. కాగా రీసెంట్గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన సినిమా షూట్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . కాగా ముందే ఈ సినిమాలో ఎటువంటి రొమాంటిక్ సీన్స్ ఉండకూడదు అని హద్దులు మీరిన సీన్స్ అస్సలు ఉండకూడదు అని రామ్ చరణ్ - బుచ్చిబాబుకి చెప్పేసారట .
కానీ కథ డిమాండ్ మేరకు ఒక నాటీ రొమాంటిక్ సీన్ ని రామ్ చరణ్ - జాన్వి కపూర్ నటించే విధంగా సీన్ మార్చారట . దీంతో వెంటనే రామ్ చరణ్ ఫుల్ ఫైర్ అయిపోయారట . అంతేకాదు ఈ విషయం తెలుసుకున్న ఉపాసన కూడా ఇలాంటి సన్నివేశాలలో నటించకూడదు అని ముందే చెప్పానుగా అంటూ రాంచరణ్ పై కూడా కోప్పడిందట. కాగా బుచ్చిబాబు సనా ఎంత బలవంతం చేసినా రామ్ చరణ్ మాత్రం అలాంటి సీన్స్ లో నటించను అంటూ తెగేసి చెప్పారట.
పరోక్షకంగా ఉపాసనకి కోపం తెప్పించినట్లు అయింది బుచ్చిబాబు . సోషల్ మీడియా లో ప్రజెంట్ ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అయితే కొంతమంది మాత్రం స్టార్ హీరోలు వాళ్ళ వైఫ్ లు పబ్లిక్ లోనే ఘాటుఘాటుగా పనులు చేస్తున్నారు అని.. అలాంటి వాళ్లు ఉపాసన ని చూసి నేర్చుకోవాలి అని .. ఉపాసన ఎంత డబ్బు ఉన్న .. ఎంత పేరు పలుకు బడి ఉన్న చాలా సింప్లి సిటీ గా ఉంటుంది అని .. పద్ధతిగా ఉంటుంది అని .. ఒక స్టార్ హీరో భార్య ఇలా ఉంటే అందరికీ బాగుంటుంది అని .. మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు .నిజంగా ఉపాసన గ్రేట్ అంటూ జనాలు కూడా ఆమెకు సంబంధించిన పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఆమె పేరు మారుమ్రోగిపోతుంది..!