తాజాగా త్రిష తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అవి చూసిన అభిమానులు ఒకసారిగా ఆశ్చర్యపోతున్నారు.. అయితే ఈ ఫోటోలను గమనించిన త్రిష వెంటనే అలర్ట్ అయి తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారంటూ ఆమె వెల్లడించింది. ఈ విషయాన్ని వెంటనే తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులకు కూడా వెల్లడించింది త్రిష. తన ట్విట్టర్ హ్యాక్ అయిందని వీటిని సరిదిద్దేవరకు తన నుంచి ఎలాంటి పోస్టులు రావు అంటూ వెల్లడించింది. తన పేరు మీద వచ్చిన ఎవరు వాటిని ఓపెన్ చేయకండి నమ్మవద్దండి అంటూ తెలిపింది.
త్రిష సోషల్ మీడియా హ్యాక్ కావడం ఇదేమి మొదటిసారి కాదట గతంలో కూడా త్రిష కు సంబంధించిన ఖాతాలను కొంత మంది హ్యాక్ చేయడం జరిగింది. ఇప్పుడు మరొకసారి ఇలాగే జరగడంతో ఈ విషయాన్ని గ్రహించిన త్రిష తాను ఎప్పుడూ కూడా క్రిస్టో గురించి ఎలాంటి పోస్టులు చేయలేదంటూ వెల్లడించింది..ఈమధ్య సెలబ్రిటీలకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను కూడా చాలా మంది హ్యాక్ చేస్తూ వారి ప్రమేయం లేకుండానే కొన్ని పోస్టులు షేర్ చేస్తూ ఉన్నారు.ఇలా చాలా మంది సెలబ్రిటీలు కూడా హ్యాకర్ల బారిన గురి కావడం జరిగింది.