హీరోలు ఆడవాళ్ళ గెటప్ వేయాలంటే అంతగా ఒప్పుకోరు. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలైతే తమ ఫ్యాన్స్ ఒప్పుకోరు అని అలాంటి లేడీ గెటప్స్ వేయడానికి మొహమాటపడుతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోలు మాత్రం సినీ ఇండస్ట్రీలో ఉన్నామంటే అన్ని రకాల పాత్రలు పోషించగలగాలి.అప్పుడే నటుడిగా పరిపూర్ణమైన గుర్తింపు వస్తుంది అని అంటూ ఉంటారు. అలా ఎంతో హీరోలు విభిన్నమైన పాత్రలు పోషించారు.మొహమాట పడకుండా లేడీ గెటప్స్ కూడా వేశారు. అలాంటి వారిలో చిరంజీవి కూడా ఒకరు. చిరంజీవి హీరోగా చేసిన చంటబ్బాయ్ మూవీలో ఈయన లేడీ గెటప్ లో కనిపిస్తారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి ఏకంగా తన మీసం తీసి నటించిన సంగతి మనకు తెలిసిందే.అయితే మొదట ఈ సినిమా షూటింగ్ సమయంలో మీసం తియ్యమని డైరెక్టర్ చెప్పగా తీయడానికి ఒప్పుకోలేదట.

కానీ ఆ తర్వాత ఒక కండిషన్ పెట్టి చిరంజీవి మీసం తీసారట. మరి ఇంతకీ చిరంజీవి పెట్టిన ఆ కండిషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. చిరంజీవి హీరోగా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన సినిమా చంటబ్బాయ్..ఈ సినిమాలో సందర్భానుసారం చిరంజీవి లేడీ గెటప్ వేయాల్సి వస్తుంది.. అయితే ఈ సినిమాలో లేడీ గెటప్ కోసం చిరంజీవిని మీసం  తీసేయమని జంధ్యాల చెప్పారట. ఇక ముందుగా కాస్త ఆలోచనలో పడి ఆ తర్వాత సినిమా యూనిట్లో ఉన్న ప్రతి ఒక్కరు మీసం తీసేస్తే నేను కూడా మీసం తీసేస్తాను అని కండిషన్ పెట్టారట చిరంజీవి.ఇక చిరంజీవి పెట్టిన కండిషన్ కి చిత్ర యూనిట్ అందరూ తలొగ్గక తప్పలేదు.

అలా నెక్స్ట్ డే చిత్ర యూనిట్ అందరూ మీసం తీసేయడంతో చిరంజీవి కూడా మీసం తీసేసి ఆ సినిమా షూట్లో పాల్గొన్నారట. అయితే ఈ విషయాన్ని రీసెంట్ గా చిరంజీవి బయట పెట్టారు. అలాగే విడుదలకు సిద్ధంగా ఉన్న లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి ఈ విషయాన్ని చెబుతూ.. నేను మీసం తీసివేశాక మళ్ళీ మీసం వచ్చేవరకు మాకు కనపడకూడదు అంటూ ఇంట్లో వాళ్ళు నన్ను తిట్టారు అంటూ చిరంజీవి ఆ ఈవెంట్లో అందరినీ నవ్వించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: