![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/actress-roja-being-sidelined-by-her-own-party-in-andhra0c85150e-ee27-4cc1-bd41-215ec1544b61-415x250.jpg)
రోజాకు ముందుగానే సమాచారం ఇచ్చి గాలి జగదీష్ ను పార్టీలో చేర్చుకోవాలని జగన్ భావిస్తున్నారని పొలిటికల్ వర్గాల టాక్. రోజా ప్రస్తుతం పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్నారని సమాచారం అందుతోంది. గాలి జగదీష్ వైసీపీలో చేరితే రాజకీయంగా ఒకింత సంచలనం అవుతుందని చెప్పవచ్చు. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసి గాలి భాను ప్రకాశ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అయితే రోజా మాత్రం వైసీపీలో గాలి జగదీష్ చేరినా తన రాజకీయ భవిష్యత్తుకు ఢోకా లేదని రోజా భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే జగన్ మాత్రం రోజాకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వబోరని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ రాజకీయాలకు సంబంధించి ముక్కుసూటిగా వ్యవహరిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే రోజా వైసీపీని వీడి మరో పార్టీలో చేరడం కూడా సులువైన విషయం కాదని చెప్పవచ్చు. నగరి నాయకత్వం విషయంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. రోజా రాజకీయాల్లో సత్తా చాటుతారో లేక రాజకీయాలకు గుడ్ బై చెబుతారో చూడాలి. రోజా పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడినట్టేనని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రోజా భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలి. రోజాపై సోషల్ మీడియాలో సైతం తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందనే సంగతి తెలిసిందే.