స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న క్రేజీ మూవీ వీడీ 12. ఇప్పటికే నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.ఈ సినిమాను మూడు భాషల్లో పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చేయబోతున్నారు. అందుకే ఆ మూడు భాషల నుండి స్టార్‌ హీరోలను తీసుకొచ్చి టీజర్‌ కోసం వాయిస్‌ ఇప్పించారట.ఇందులో డైలాగ్స్ కంటే వాయిస్ ఓవర్ ఎక్కువగా ఉంటుంది. ఆ వాయిస్ ఓవర్ ను తెలుగులో ఎన్టీఆర్, హిందీలో రణ్ బీర్ కపూర్, తమిళ్ లో సూర్యతో చెప్పిస్తున్నారు. అంటే సినిమా రేంజ్ ఏ రేంజ్ లో పెరుగుతుందో అంచనా వేయొచ్చు. ఇలా పెరగడానికి కారణం నిర్మాణ సంస్థ మీద ఉన్న గుడ్ విల్ మాత్రమే. కేవలం విజయ్ మూవీ కావడం వల్ల వాళ్లు వాయిస్ చెప్పడం లేదు. సితార బ్యానర్ మూవీ కాబట్టే ఓకే చెప్పారు అనేది కాదనలేని వాస్తవం. అటు దర్శకుడూ పెద్ద ఫేమ్ ఉన్నవాడేం కాదు కదా. సో.. ఇలాంటి బిగ్గీస్ ను రంగంలోకి దించి విజయ్ మూవీకి తద్వారా విజయ్ కీ ప్యాన్ రేంజ్ లో మరింత ఫేమ్ క్రియేట్ చేయబోతోంది సితార బ్యానర్.

ఒకవేళ ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా అతను టైర్ 1 హీరోల లిస్ట్ లోకి ఎంటర్ అయిపోతాడు అనేది ఇండస్ట్రీ అంతా చెప్పుకునే మాట. ఆ ఎంట్రీ సితార ద్వారా జరగబోతోందనే అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. సో.. విజయ్ దేవరకొండ సితార బ్యానర్ నుంచి సెటిల్ కాబోతున్నాడు అనుకోవచ్చేమో ఇదిలా ఉంటే తెలుగులో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తుండగా విజయ్ దేవరకొండ ఆయనతో ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు. నిన్నటి రోజు ఎక్కువ భాగం ఎన్టీఆర్ తోనే గడిపాను. జీవితం, కాలం, సినిమా గురించి మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఉన్నాం. టీజర్ డబ్ చేస్తున్నప్పుడు కూర్చుని, దానికి ప్రాణం పోసుకోవడం చూసి అతను నాలాగే ఉత్సాహంగా ఉన్నాడు. ధన్యవాదాలు తారక్ అన్నా, మీ పిచ్చిని మా ప్రపంచానికి తీసుకువచ్చినందుకు అని విజయ్ రాసుకొచ్చాడు. ఇక ఇటీవలి అనౌన్స్ మెంట్ పోస్టర్ లో కిరీటాన్ని చూపించడంతో పాటు 'ది సైలెంట్ క్రౌన్, అవేట్స్ ది కింగ్..' అని క్యాప్షన్ రాసి ఉంచడం ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: