![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/socialstars-lifestyle81ea33a4-ff25-4181-83ee-5da35266f318-415x250.jpg)
కానీ చిరంజీవి అత్యుత్సాహంతో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వివాదాస్పదంగా మారాయి. నెటిజెన్స్ తో పాటు అభిమానులు కూడా చిరంజీవి ని ఏకిపారేస్తున్నారు. దయచేసి కొన్ని రోజులు ఇలాంటి ఈవెంట్స్ కి దూరం గా ఉండాలంటూ ఫ్యాన్స్ సూచిస్తున్నారు. విషయంలోకి వెళ్తే యాంకర్ సుమ,చిరంజీవి వద్దకు వెళ్లి క్లిన్ కారా వాళ్ళ తాత గారి ఫోటో చూపించండి అని అనగా, చిరంజీవి ఫోటో LED స్క్రీన్ లో చూపిస్తారు. అప్పుడు చిరంజీవి మాట్లాడుతూ 'ఇంట్లో నా పరిస్థితి లేడీస్ వార్డెన్ లెక్క అయిపోయింది. నా చుట్టూ మొత్తం ఆడపిల్లలే. చరణ్ని ఒక్కోసారి అడుగుతుంటాను, దయచేసి ఈసారి ఒక అబ్బాయిని కనురా, మన లేజసీ ని ముందుకు కొనసాగించాలి అని. మళ్ళీ ఆడపిల్ల పుడుతుందేమో అని భయం వేస్తుంది' అంటూ చిరంజీవి నవ్వుతూ చెప్పుకొచ్చాడు.
దీనిని నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో తప్పు పడుతున్నారు. అబ్బాయి పుట్టాలి అని కోరుకోవడం లో తప్పే లేదు, కానీ మీ లేజసీ ని అమ్మాయిలు కొనసాగించలేరని భావిస్తున్నారా..?, ఆడపిల్లలు అంటే అంత చులకన అయిపోయారా అంటూ చిరంజీవి ని తీవ్రంగా విమర్శిస్తున్నారు నెటిజెన్స్. మెగాస్టార్ చిరంజీవి కి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన కుటుంబం నుండి గ్లోబల్ స్టార్స్ ఉన్నారు. ఆయన తమ్ముడు స్వయానా ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, చాలా ఉన్నతమైన స్థానంలో కూర్చొని ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు, ఆడపిల్లలతో తమ కళలను సాకారం చేసుకోలేరు అనే అభిప్రాయం స్వయానా మెగాస్టార్ చిరంజీవి స్థాయి వ్యక్తి చెప్పడం ఎంత వరకు కరెక్ట్ మీరే చెప్పండి.అలాగే 2025లోనూ పురుషాధిక్యమే కోరుకుంటున్నారని మండిపడుతున్నారు. అయితే వారసుడిని కోరుకోవడంలో తప్పేంటి అని మరికొందరు చిరు వ్యాఖ్యలను సమర్ధిస్తున్నారు.