టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. చరణ్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ కొనసాగిస్తున్నాడు. ఇకపోతే చరణ్ కొన్ని సంవత్సరాల క్రితం జంజీర్ అనే హిందీ సినిమాలో కూడా హీరోగా నటించాడు. కానీ ఈ మూవీ హిందీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాని తుఫాన్ అనే పేరుతో తెలుగు లో విడుదల చేయగా ఈ మూవీ టాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడంలో విఫలం అయింది.

ఇకపోతే కొంత కాలం క్రితం రామ్ చరణ్ "ఆర్ ఆర్ ఆర్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో చరణ్ కి హిందీ లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే తాజాగా చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ కూడా పాన్ ఇండియా మూవీ గా విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే చరణ్ తో సినిమా చేయడానికి ఓ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తహతహలాడుతున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... కొంత కాలం క్రితం కిల్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి నిఖిల్ నాగేష్ బట్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయన్ని సాధించింది. ఇకపోతే ఈ దర్శకుడు చరణ్ తో సినిమా చేయాలి అని అనుకుంటున్నట్లు , అందులో భాగంగా ఆయనతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు అన్నీ ఓకే అయితే నిఖిల్ నాగేష్ బట్ దర్శకత్వంలో చరణ్ హీరోగా ఓ మూవీ వచ్చే అవకాశం ఉన్నట్లు ఓ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: