తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా , దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో విశ్వక్ సేన్ ఒకరు. ఈయన ఈ నగరానికి ఏమైంది అనే మూవీ తో మంచి విజయాన్ని అందుకొని మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన ఫలక్ నామా దాస్ అనే సినిమాలో హీరోగా నటించి , ఆ సినిమాకు దర్శకత్వం కూడా వహించి నటుడిగా , దర్శకుడిగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇకపోతే తాజాగా విశ్వక్ సేన్ "లైలా" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఇకపోతే ఈ సినిమాలో విశ్వక్ రెండు డిఫరెంట్ షేడ్స్ కలిగిన పాత్రలలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో విశ్వక్ స్టైలిష్ కుర్రాడి పాత్రలోనూ ,  అమ్మాయి గెటప్ లో కనిపించబోతున్నాడు. ఇలా కెరియర్లో మొట్ట మొదటి సారి విశ్వక్ అమ్మాయి గెటప్ లో కనిపించనున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ని ఫిబ్రవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. అలాగే ఈ మూవీ కి సంబంధించిన రన్ టైమ్ ను కూడా లాక్ చేశారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సెన్సార్ బోర్డు సభ్యుల నుండి "ఏ" సర్టిఫికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ ని 2 గంటల 16 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.

ఇకపోతే సహజంగా "ఏ" సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డ్ సభ్యులు ఎక్కువ రొమాన్స్ , హార్రర్ , రక్తపాతం ఉన్న జారీ చేస్తూ ఉంటారు. ఇక ఈ సినిమా ప్రచార చిత్రాలను బట్టి చూస్తే ఈ మూవీ లో హార్రర్ , రక్తపాతం ఉన్న దాఖలాలు కనిపించడం లేదు. దానితో ఈ మూవీ లో ఎక్కువ రొమాన్స్ సన్నివేశాలు ఉండడం వల్లే "ఏ" సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు సభ్యులు జారీ చేసి ఉంటారు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs