తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులలో అక్కినేని నాగ చైతన్య ఒకరు. ఇకపోతే ఈయన ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించాడు. నాగ చైతన్య కెరియర్ లో బ్లాక్ బస్టర్ సినిమాలలో లవ్ స్టోరీ మూవీ ఒకటి. ఈ మూవీ లో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా ... శేఖర్ కమ్ముల ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే తాజాగా చైతన్య తండెల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే.

సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... చందు మండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ ఫిబ్రవరి 7 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటి వరకు నాలుగు రోజుల బాక్సా ఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇకపోతే ఈ నాలుగు రోజుల్లోనే ఈ సినిమా చైతన్య కెరియర్ లో బ్లాక్ బాస్టర్ సినిమా లవ్ స్టోరీ మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్ లను దాటేసింది. లవ్ స్టోరీ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి తెలుగు రాష్ట్రాల్లో 27.52 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేయగా , ప్రపంచ వ్యాప్తంగా 35.05 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లను వసూలు చేసి , 62 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

ఇకపోతే తండెల్ మూవీ నాలుగు రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో 27.74 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేయగా , ప్రపంచ వ్యాప్తంగా 34.49 కోట్ల కి పైగా షేర్ ను , 60 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇక ఐదవ రోజుతో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కూడా లవ్ స్టోరీ మూవీ ఫైనల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ లను క్రాస్ చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి అని చాలా మంది అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని అక్కినేని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: