టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రాజా వారు రాణి గారు మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన ఈ నటుడు ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన వరుస పెట్టి సినిమాల ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలు సాధించడం ద్వారా ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే కిరణ్ ఆఖరుగా "క" అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా కిరణ్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో చాలా వరకు పెరిగింది. ఇది ఇలా ఉంటే తాజాగా కిరణ్ "దిల్ రబా" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని ఫిబ్రవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొంత కాలం క్రితం ప్రకటించారు.

కాకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన ఈ మూవీ కి సంబంధించిన మ్యూజిక్ పనులు చాలా పెండింగ్లో ఉన్నట్లు , దానితో ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని , ఈ మూవీ ని ఫిబ్రవరి 26 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు అని ఓ వార్త వైరల్ అయింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా పోస్ట్ పోన్ చేయడానికి సిద్ధం అయినట్లు , కాకపోతే ఈ మూవీ ని ఫిబ్రవరి 26 వ తేదీన కాకుండా మార్చి 14 వ తేదీన విడుదల చేసే ఆలోచనకు మేకర్స్ వచ్చినట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా అతి త్వరలో రాబోతున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: