![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/business_videos/chiranjeevi23fea31c-f095-477b-b86a-c1033e363fbf-415x250.jpg)
మెగాస్టార్ చిరంజీవిని ఏకీపారేస్తూ... ప్రెస్ మీట్ లో రెచ్చిపోయారు యాంకర్ శ్యామల. అసలు అమ్మాయిలు వద్దని మెగాస్టార్ చిరంజీవి ఏ ఉద్దేశంతో అన్నారు తెలియదు అంటూ... ఆగ్రహించారు. వారసుడు అనే వాళ్ళు కొడుకు అనే ఉద్దేశంలో నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుందని చురకలాంటించారు. మహిళలు అభివృద్ధి చెంది ముందుకు వెళ్తున్నారని మెగాస్టార్ చిరంజీవి గుర్తు పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు... అలాంటి మహిళ ఇంట్లో.. చిరంజీవిలా వంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడ్డారు. వారసులు అంటే ఒక్క కొడుకే ఉండనవసరం లేదు అనేది మా అభిప్రాయం అంటూ శ్యామల తెలిపారు. ఒక్కరి వ్యాఖ్యల వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం దెబ్బతింటుందని ఫైర్ అయ్యారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా హెచ్చరించారు.
ఇక ఏపీలో మహిళలకు రక్షణ కరువైన నేపథ్యంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చప్పుడు లేకుండా... దేవాలయాల చుట్టూ తిరుగుతున్నాడని చురకలాంటించారు. ఇది ఇలా ఉండగా.. ఓ సినిమా ఈవెంట్ లో నిన్న మెగాస్టార్ హాట్ కామెంట్స్ చేశారు. రామ్ చరణ్ కు కూతుర్లు కాకుండా కొడుకు పుట్టాలని ఆయన కోరడం జరిగింది. తన ఇంట్లో అందరూ లేడీస్ ఉన్నారని... అంతేకాదు తన ఇల్లు మొత్తం లేడీస్ హాస్టల్ అయిపోయిందంటూ పేర్కొన్నారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ పై రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజెన్స్.