సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయాలు ఎవరికైతే ఉంటాయో వారికే క్రేజీ సినిమాల్లో అవకాశాలు వస్తాయి అనే వాదనను చాలా మంది వినిపిస్తూ ఉంటారు. కానీ కొంత మంది నటీమణులలో విషయంలో మాత్రం ఇది తప్పు అని చాలా సార్లు రుజువు అయింది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా ఓ ముద్దుగుమ్మ అనేక సినిమాలలో నటించిన ఒకే ఒక విజయం దక్కిన కూడా ఆమెకు వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి.

బ్యూటీ మరెవరో కాదు ఆమె నీది అగర్వాల్. ఈ ముద్దుగుమ్మ సవ్యసాచి అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ మిస్టర్ మజ్ను అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ నటి కొంత కాలం క్రితం రామ్ పోతినేని హీరోగా రూపొందిన ఈస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో ఈ నటి తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో నిధి అగర్వాల్ కి ఈ సినిమా ద్వారా అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఈ మూవీ తర్వాత కూడా ఈమె కొన్ని సినిమాలలో నటించింది. కానీ ఆ మూవీ ల ద్వారా కూడా ఈమెకు మంచి విజయాలు దక్కలేదు.

ఇలా ఈమె ఇప్పటి వరకు నటించిన సినిమాలలో కేవలం ఒకే ఒక సినిమా ద్వారా ఈమె మంచి విజయం సాధించిన ఈమెకు మాత్రం క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న హరిహర వీరమల్లు , రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందుతున్న రాజా సాబ్ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు కనుక మంచి విజయాలు సాధించినట్లయితే ఈ బ్యూటీ క్రేజ్ తెలుగులో అద్భుతమైన స్థాయికి పెరిగే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: