ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీ పైరసీ వల్ల తీవ్రస్థాయిలో నష్టపోతూ ఉండటం నెట్టింట ఒకింత హాట్ టాపిక్ అవుతోంది. తండేల్ సినిమా ఇప్పటికే ఒకసారి ఆర్టీసీ బస్సులో ప్రదర్శించబడగా ఈ విషయంలో ఇప్పటికే విచారణకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా మరోసారి వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్సులో తండేల్ సినిమాను ప్రదర్శించినట్టు బన్నీ వాసు వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
 
చైతన్య తండేల్ సినిమాను కావాలనే టార్గెట్ చేశారా అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బన్నీవాసు తన పోస్ట్ లో మా సినిమా పైరసీని రెండోసారి ప్రదర్శించారని ఎంతో కష్టపడి మేము ఈ సినిమాను తీశామని ఇలాంటి పనుల వల్ల సినిమా ఇండస్ట్రీకి నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. ఈ విధంగా చేయడం ఎంతోమంది క్రియేటర్స్ శ్రమను అగౌరవపరచడం అవుతుందని ఆయన తెలిపారు.
 
ఇందుకు సంబంధించిన వీడియోను సైతం బన్నీవాస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. పైరసీ వల్ల తండేల్ మూవీ మేకర్స్ తీవ్రస్థాయిలో నష్టపోతున్నారు. పైరసీ బారిన పడకుండా ఉండి ఉంటే తండేల్ మూవీ కలెక్షన్లు మరింత మెరుగ్గా ఉండేవని కామెంట్లు వినిపిస్తున్నాయి. తండేల్ మూవీ సక్సెస్ నాగార్జునకు సైతం ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పవచ్చు.
 
హీరో అఖిల్ కూడా తర్వాత సినిమాలతో సక్సెస్ సాధిస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. నాగార్జున సైతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి రాబోయే రోజుల్లో భారీ సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అక్కినేని హీరోల సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. అక్కినేని హీరోలు రాబోయే రోజుల్లో ఎలాంటి విజయాలను సొంతం చేసుకుంటారో చూడాలి. వీక్ డేస్ లో కూడా తండేల్ మూవీ అదరగొడుతుండగా మరికొన్ని వారాల పాటు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు తిరుగులేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.


 


మరింత సమాచారం తెలుసుకోండి: