తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కెరియర్ ప్రారంభంలో మంచి విజయాలను అందుకొని చాలా తక్కువ సమయంలో అద్భుతమైన గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలు సంపాదించుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈయన నటించిన సినిమాలు ఏవి పెద్ద స్థాయిలో విజయాలను అందుకోలేదు. ఆఖరుగా విజయ్ "ది ఫ్యామిలీ స్టార్" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీ ని వీడి 12 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తూ వస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు టీజర్ వీడియోను ఫిబ్రవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ యొక్క టీజర్ ను తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క టీజర్ తెలుగు వర్షన్ కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనుండగా , హిందీ వర్షన్ కు రన్బీర్ కపూర్ , తమిళ్ వెర్షన్ కో సూర్య వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మూవీ యొక్క కన్నడ , మలయాళ వర్షన్ లను కూడా ఫిబ్రవరి 14 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ రెండు భాషల టీజర్ లకి ఎవరు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు అనే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి వార్తలు బయటకు రావడం లేదు  మరి ఈ రెండు వర్షన్ టీజర్ లకి ఎవరు వాయిస్ ఓవర్ ఇస్తారు అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd