
శ్రీ లక్ష్మీ సతీష్ హీరోయిన్ గా, సత్య యదు హీరోగా వస్తున్న ఈ సినిమాకి గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించారు. ఆర్జీవి ఆర్వి ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై రవి శంకర్ వర్మ నిర్మించారు.తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో ఫిబ్రవరి 28వ తేదీన విడుదల కాబోతోంది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రానికి టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ అనే ట్యాగ్ లైన్ కూడా జోడించడం జరిగింది. ఇకపోతే సోషల్ మీడియాలో ముక్కు మొహం తెలియని వాళ్ళతో పరిచయాలు పెంచుకొని, వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ తెలియకుండానే వారిని నమ్మేసి, వారిని కలిసి ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తెలియని వ్యక్తులతో ఎదురయ్యే ప్రమాదాలు భయంకర సంఘటనల ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించారు.
నిజజీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో ఆరాధ్య దేవి తన నటనకు మించి ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఒకవైపు బోల్డ్ గా నటిస్తూనే మరొకవైపు తన అందాలతో అందరినీ అలరించింది. ఇక శారీ లో ఉన్న బ్యూటీ ని చూసి మైమరిచిపోయి ఆమెను బలవంతంగా అనుభవించాలని చూసిన ఒక సైకో చివరికి ఆమెను వశం చేసుకున్నాడా? అతడి నుండి ఆమె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? అనే అంశాలతో ట్రైలర్ను తెరకెక్కించారు.