మాస్ మహారాజా రవితేజ కెరియర్లో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు ఉన్నాయి. ఇకపోతే రవితేజ కెరియర్లో అద్భుతమైన క్లాసిక్ మూవీ లలో ఒక్కటిగా నిలిచిపోయిన సినిమాలలో నా ఆటోగ్రాఫ్ సినిమా ఒకటి. 2004 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా రవితేజ కు గొప్ప గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ కూడా ఈ సినిమా బుల్లి తెరపై ప్రసారం అయితే ఈ మూవీ కి మంచి టి ఆర్ పి రేటింగ్ దక్కుతూ ఉంటుంది. దీని ద్వారానే అర్థం అవుతుంది ఇప్పటికీ కూడా ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తున్నారు అనేది.

ఇకపోతే ఈ సినిమాలో భూమిక , గోపిక , మల్లిక , స్రవంతి , ప్రకాష్ రాజ్ , సునీల్ నటించారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే బుల్లి తెర ప్రేక్షకులను అద్భుతమైన స్థాయిలో అలరిస్తున్న ఈ సినిమాను మరికొన్ని రోజుల్లోనే రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను ఫిబ్రవరి 22 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో అనేక తెలుగు సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి.

అందులో కొన్ని సినిమాలు అద్భుతమైన కలెక్షన్లను కూడా బాక్సా ఫీస్ దగ్గర రాబట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పటికే ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఇలాంటి ఇంపాక్ట్ ను చూపించి , ఏ రేంజ్ కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబడుతుంది అనే విషయం తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే ఎస్ గోపాల్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను బెల్లంకొండ సురేష్ నిర్మించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: