తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలకు కథ రచయితగా పని చేశాడు. ఈయన కథ రచయితగా పని చేసిన సినిమాలలో కూడా చాలా సినిమాలు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. ఇలా కథ రచయితగా చాలా సినిమాలకు పని చేసిన ఈయన కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందిన పటాస్ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టాడు.

మూవీ మంచి విజయం సాధించింది. దానితో ఈయనకు దర్శకుడిగా మంచి క్రేజ్ వచ్చింది. ఈ మూవీ తర్వాత ఈయన సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 , సరిలేరు నీకెవ్వరు , ఎఫ్ 3 ,  భగవంత్ కేసరి , సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో వరుసగా ఎనిమిది విజయాలను అందుకొని ఒక్క అపజయం కూడా లేని దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే అనిల్ రావిపూడి తన తదుపరి మూవీ ని మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి కి ఓ సెంటిమెంట్ ఉంది. ఆయన ఆ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

అసలు విషయం లోకి వెళితే ... ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయనకు మీరు కచ్చితంగా మీ యొక్క సినిమా స్క్రిప్ట్ ని వైజాగ్ లోనే రాస్తూ ఉంటారు. దానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా అనే ప్రశ్న ఎదురయింది. దానికి అనిల్ రావిపూడి సమాధానం చెబుతూ ... అవును ... పటాస్ సినిమా నుండి నేను వైజాగ్ లోని స్క్రిప్ట్ ను తయారు చేస్తాను. ముఖ్యంగా సినిమా ఫస్ట్ అఫ్ కచ్చితంగా వైజాగ్ లోని పార్క్ హోటల్ లోనే తయారు చేస్తాను అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: