టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అనేక మంది ముద్దుగుమ్మలు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొంత మందికి మాత్రమే అద్భుతమైన విజయాలు , సూపర్ క్రేజ్ దక్కుతూ ఉంటుంది. ఇక మరి కొంత మంది కి స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలలో నటించిన కూడా పెద్ద స్థాయిలో క్రేజ్ రాదు. ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందిన ఓ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన కూడా ఓ ముద్దు గుమ్మకు అద్భుతమైన క్రేజ్ రాలేదు.

ఆ తర్వాత ఆ నటి తెలుగు సినిమాల్లో కూడా ఎక్కువగా కనిపించలేదు. ఇకపోతే ఆమె ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు ప్రభాస్ హీరోగా రూపొందిన బుజ్జిగాడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన సంజన గర్లాని.

ఈ ముద్దు గుమ్మ బుజ్జిగాడు సినిమాలో కాస్త సమయమే కనిపించిన తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ మూవీ ద్వారా ఈమెకి మంచి గుర్తింపు వచ్చింది. దానితో బుజ్జిగాడు సినిమా తర్వాత ఈమెకు వరుస పెట్టి తెలుగులో అవకాశాలు వస్తాయి అని , ఈ బ్యూటీ అద్భుతమైన స్థాయికి చేరుకుంటుంది అని చాలా మంది భావించారు.

కానీ ఈమెకు బుజ్జిగాడు సినిమా తర్వాత పెద్ద స్థాయిలో అవకాశాలు తెలుగులో రాలేదు. దానితో ఈమె కూడా ఆ తర్వాత కొంత కాలానికి తెలుగు పరిశ్రమకు దూరం అయింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను , వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్ పోస్ట్ చేస్తూ తన అభిమానులతో టచ్ లో ఉంటూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: