- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


నందమూరి నట‌సింహ గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ నటించిన తాజా బ్లాక్ బస్టర్ సినిమా డాకు మహారాజ్‌. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను ద‌ర్శ‌కుడు బాబి కొల్లి డైరెక్టు చేయ‌గా .. కంప్లీట్ యాక్షన్ స్టైలిష్ ఎంటర్టైనర్ సినిమాగా తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో బాలయ్యను చాలా స్టైలిష్ గా బాబి చూపించిన తీరుకు ప్రేక్షకులు ఫిధా అయి పోయారు. ఈ సినిమా రిలీజ్ అయి ఇప్పటికే రోజులు అవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటి స్ట్రీమింగ్ కు ఎప్పుడు ఎప్పుడు వస్తుందా ? అని అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన రామ్చరణ్ గేమ్ ఛేంజ‌ర్ సినిమా ఇప్పటికే ఆమోజాన్‌ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.


మరో సినిమా సంక్రాంతికి వస్తున్నాం కూడా త్వరలోనే జి ఫైవ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక డాకు మహారాజ్ ఓటీటీ రైట్స్ నేట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే డాకు మహారాజ్ సినిమాకు సంబంధించి ఇతర భాషలలో డబ్బింగ్ చేసిన కంటెంట్ ఇంకా నెట్ ఫ్లిక్స్ కు చేర లేదని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ఓటీటీ లేట్‌ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న డాకూ మహారాజ్‌ ఓటిటి స్ట్రిమింగ్ ఎప్పుడు ఉంటుందో చూడాలి. ఈ సినిమా ను నిర్మాత నాగ వంశీ సూర్య దేవ‌ర తో పాటు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ భార్య సాయి సౌజ‌న్య సంయుక్తంగా నిర్మించారు. ప్ర‌గ్య జైశ్వాల్ - శ్ర‌ద్ధ శ్రీనాథ్ - చాందిని చౌద‌రి - ఊర్వ‌శీ రౌతేలా హీరోయిన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: