నాగ చైతన్య హీరో గా సాయి పల్లవి హీరోయిన్గా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన తండెల్ మూవీ ఫిబ్రవరి 7 వ తేదీన విడుదల అయ్యి బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ కి అద్భుతమైన సూపర్ సాలిడ్ కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటి వరకు ఐదు రోజుల బాక్సా ఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ ఐదు రోజుల్లో ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. ఇక మరీ ముఖ్యంగా ఈ సినిమాకు ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్ లు వచ్చాయి. దానితో 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన మీడియం రేంజ్ మూవీలలో తండెల్ మూవీ సూపర్ సాలిడ్ ప్లేస్ లో దక్కించుకుంది.

ఐదవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో హనుమాన్ మూవీ 6.04 కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా , గీత గోవిందం సినిమా 4.66 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలోనూ , ఎంసీఏ సినిమా 3.51 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలోనూ , ఉప్పెన సినిమా 3.12 కోట్ల కలెక్షన్లతో 4 వ స్థానం లోనూ , బేబీ సినిమా 2.94 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానం లోనూ , టిల్లు స్క్వేర్ సినిమా 2.80 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానం లోనూ , జాతి రత్నాలు సినిమా 2.74 కోట్ల కలెక్షన్లతో ఏడవ స్థానం లోనూ , స్కంద సినిమా 2.72 కోట్ల కలెక్షన్లతో ఎనిమిదవ స్థానం లోనూ , తండెల్ మూవీ 2.63 కోట్ల కలెక్షన్లతో తొమ్మిదవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc