చిరంజీవి ..నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్ గా ..పెద్దమనిషిగా ఉండేవాడు అని జనాలు మాట్లాడుకునే వాళ్ళు . కానీ గత కొన్ని గంటల నుంచి చిరంజీవి పేరు సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతుంది . దానికి కారణాలు చాలానే ఉన్నాయి. మరి ముఖ్యంగా చిరంజీవి కొడుకు రామ్ చరణ్ రెండోసారి తండ్రి అవ్వాలి అని ఈసారి కచ్చితంగా మగపిల్లాడే పుట్టాలి అని మెగా ఫాన్స్ చాలా మంది కోరుకుంటున్నారు . కొంతమంది ఏకంగా ఇంటర్వ్యూలలో సైతం దాని గురించి మాట్లాడుతున్నారు.  మరీ ముఖ్యంగా రీసెంట్గా "గేమ్ ఛేంజ్జర్" సినిమా ప్రమోషన్స్ కోసం అన్ స్టాపబుల్ షో కి వచ్చిన రామ్ చరణ్ ను ఏకంగా తన అమ్మ నాన్నమ్మ ఒక లెటర్ ద్వారా తమకు వారసుడు కావాలి అని .. అది ఈ సంవత్సరంలోనే కావాలి అంటూ రిక్వెస్ట్ చేస్తారు .


దానికి  చరణ్ కూడా సరదాగా నవ్వేస్తాడు.  అయితే ఇప్పుడు చరణ్ గురించి చిరంజీవి మాట్లాడిన మాటలు మరొకసారి ట్రెండ్ అవుతున్నాయి . రీసెంట్గా చిరంజీవి బ్రహ్మానందం కొడుకు గౌతమ్ నటించిన "బ్రహ్మ ఆనందం" సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వెళ్లారు.  ఈ క్రమంలోనే స్టేజి పైకి వచ్చిన చిరంజీవి తనదైన స్టైల్ లో అదరగొట్టాడు.  అంతేకాదు అక్కడ ఫంక్షన్ లో చిరంజీవి ఫ్యామిలీ ఫోటో వేయగా అది చూసిన చిరంజీవి ఇది చూసినప్పుడు ఇంట్లో అందరూ ఆడపిల్లలు ఉన్నప్పుడు నేను ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లా అనిపిస్తానని .. ఈసారైనా ఒక మగపిల్లాడిని కన్నండి  అంటూ చెప్పాను అని ..మన లెగిసి కంటిన్యూ చేయాలి అంటే మగపిల్లాడు పుట్టాలి అని మళ్ళీ ఎక్కడ ఆడపిల్ల పుట్టేస్తుందో అన్న భయం ఉంది అంటూ సరదాగా వ్యాఖ్యానించారు .



ఇది చిరంజీవి సరదాగా అన్నాడా..? సీరియస్గా అన్నాడా...? పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం హ్యూజ్ ట్రోల్లింగ్ ఎదుర్కొంటున్నాడు . అసలు పాప పుడుతుందా..? బాబు పుడుతాడా..? అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది. అది ఇద్దరూ పేరెంట్స్ అనుకుంటే వచ్చేది కాదు . ఆ దేవుడు ఇవ్వాలి అంతే . ఇలా చరణ్ ని కొడుకు కొడుకు అని బలవంతం చేయడం ఎంతవరకు కరెక్ట్ . ఇంత చదువుకొని ఇంత స్టార్ గా మారిన చిరంజీవికి ఆమాత్రం తెలియదా ..? అంటూ కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.  మరికొందరు ఉపాసనాకి ప్రెజర్ ఎక్కువైనట్లుంది .. స్టేజిపై ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఆమె ఎంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంది అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు . మొత్తానికి చిరంజీవి సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోల్లింగ్ కి గురి అవుతున్నాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: