![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/vishwak90f4efb1-d9eb-41ee-b541-da119f5bea23-415x250.jpg)
మాస్కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా లైలా. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయింది. ఈ సినిమాను దర్శకుడు రామ్ నారాయణ డైరెక్ట చేయగా.. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు .. టీజర్ .. ట్రైలర్లు సినిమాపై పాజిటివ్ అంచనాలు క్రియేట్ చేశాయి. సినిమా కచ్చితంగా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా నిలుస్తుందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ఇప్పటికే వైరల్ అవుతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి లైలా సినిమాకు ఏ సర్టిఫికెట్ జారీ అయింది. ఇందులో బోల్డ్ డైలాగులతో పాటు కొన్ని సీన్లు కారణంగా సినిమాకి ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.
ఇక ఈ సినిమా టోటల్ రంగ్ టైం 2.16 గంటలు గా ఫిక్స్ చేశారు. అంటే సినిమా 136 నిమిషాల పాటు ఉంటుంది. ఇప్పుడు ఉన్న సినిమాలతో పోల్చుకుంటే క్రిస్పీ రన్ టైం తో ఈ సినిమా వస్తున్నట్టే చెప్పాలి. సినిమా కచ్చితంగా యూత్ ఆడియన్స్ను పిచ్చపిచ్చగా ఆకట్టుకుంటుందని .. చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ సినిమాలో యంగ్ హీరో విశ్వక్సేన్ తొలి సారి లేడీ గెటప్ లో నటిస్తున్నారు. అందాల భామ ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటిస్తుండగా జేమ్స్ లియోన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా రావడంతో పాటు విశ్వక్సేన్ గురించి చేసిన కామెంట్లు సినిమాపై మరింత హైప్ తీసుకు వస్తున్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు.