టాలీవుడ్ ఇండస్ట్రీ లో నాగార్జున అగ్ర కథానాయకులలో ఒకరు. ఆయనకు బోల్డంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కినేని హీరోలకు రొమాంటిక్ ఇమేజ్ ఉంది. కింగ్ నాగార్జునను మన్మథుడు అంటూ కొంత మంది ఫ్యాన్స్ ముద్దుగా పిలుస్తారు.ఇదిలావుండగా యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'తండేల్' భారీ సక్సెస్ సాధించింది. బాక్సాఫీస్ బరిలో 100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ఇది చేరుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. వసూళ్లను మించిన ప్రశంసలు చైతన్య నటనకు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఆ పతాక సన్నివేశాలలో ఆయన కనబరిచిన అభినయం అందరి చేత క్లాప్స్ కొట్టించింది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. దానికి నాగార్జునను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా నాగార్జున రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ తన ఫేవరెట్ సంగీత దర్శకుడని నాగార్జున అన్నారు.

 ఇదిలావుండగా తన తో లవ్ స్టోరీ చేయాలని ఒక డైరెక్టర్ కు దేవి సూచించారని, అది ఇప్పుడెలా కుదురుతుందని కింగ్ చమత్కరించారు.అలాగే తండేల్ కు మంచి సంగీతాన్ని అందించారని ప్రశంసించారు.అలాగే తను ఇలా సక్సెస్ మీట్ కు వచ్చి చాలా రోజులైంది అని అన్నారు.చాలా సంతోషంగా వుంది. అలాగే బుజ్జితల్లి సాంగ్ అవుట్ స్టాండింగ్ హిట్. అలాగే చైతన్య మొహంలో నవ్వు చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. సినిమా అంతా ఆ లుక్, నడక, క్యారెక్టర్ ని మెంటైన్ చేసి చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. ఫోన్ కాల్ సీన్, బోట్ సీన్, జైలు సీక్వెన్స్ ఇలా చాలా సీన్స్ లో తన నటన ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో చైతన్యని చూస్తుంటే నాన్నగారు గుర్తుకు వచ్చారు. అక్కినేని అభిమానులకి థాంక్ యూ. 2025లో ఇది ముహూర్తం. వస్తున్నాం కొడుతున్నాం. థాంక్ యూ వెరీ మచ్అన్నారు.ఈ క్రమంలోనే సినిమా చాలా బాగుందని, క్లైమ్యాక్స్ అద్భుతంగా తీశావంటూ డైరెక్టర్ చందూ మొండేటిని ప్రశంసించాడు. అయితే 2025లో ఇది కేవలం ముహూర్తమే అని, వస్తున్నాం.. మిగతాది వాడితోనే చెప్పిస్తా అని నాగార్జున అనగానే.. కొడుతున్నాం అని చైతన్య అన్నాడు. ఈ తండ్రీ కొడుకుల కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: