మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్స్ మూవీస్ ఉన్నాయి. అందులో కొన్ని చిత్రాలు అభిమానులకు తీపి జ్ఞాపకం అని చెప్పాలి. అలాంటి చిత్రాల్లో ‘గ్యాంగ్ లీడర్’ మూవీ ఒకటి. 90వ దశకంలో రికార్డులు తిరగరాసిన సినిమా గ్యాంగ్ లీడర్. ఈ చిత్రం వచ్చి 3 దశాబ్దాలు దాటిన అభిమానులు ఇప్పటికే ఈ సినిమాలోని డైలాగులు గుర్తు చేసుకుంటూ ఉంటారు.విజయ బాపినీడు తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయశాంతి హీరోయిన్. అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులతో చెడుగుడు ఆడుకుంది గ్యాంగ్ లీడర్.ఈ సినిమాకు బప్పీలహరి మ్యూజిక్ అందించారు. విజయ బాపినీడు దర్శకత్వం వహించారు. శ్యాం ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించారు. 1991లో మే 9న విడుదలైన ఈ సినిమా అప్పటివరకు ఉన్న అన్ని సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమాకు ముందు చిరంజీవికి వరుసగా ప్రతి యేటా ఓ ఘనవిజయం లభించింది. దాంతో ‘గ్యాంగ్ లీడర్’ ఆరంభం నుంచీ సినిమాకు విడుదలకు ముందే క్రేజ్ వచ్చింది. ఈ చిత్రంలో  ప్రతి డైలాగ్ అదిరిపోయింది. ముఖ్యంగా ‘చేయి చూడు ఎంత రఫ్‌గా ఉందో రఫ్పాడించేస్తా’ అనే డైలాగ్ ప్రేక్షకుల నోళ్లలో నానింది. ఇక ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఆయన ఒక షోలో పాల్గొన్నప్పుడు తను చేసిన గ్యాంగ్ లీడర్ సినిమా ను ఇప్పుడున్న హీరోల్లో ఏ హీరోలు చేస్తే బాగుంటుంది అని ప్రశ్న అడగారు. దానికి చిరంజీవి స్పందిస్తూ రామ్ చరణ్  గానీ లేదంటే జూనియర్ ఎన్టీఆర్ గానీ ఈ సినిమా చేస్తే అద్భుతంగా ఉంటుంది అని చెప్పాడు.నిజానికి చిరంజీవి కెరీర్లో టాప్ టెన్ సినిమాల్లో ‘గ్యాంగ్ లీడర్’ ఒకటిగా నిలుస్తుంది.పక్కా కమర్షియల్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాని ప్రేక్షకులందరిని మెప్పిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న చిరంజీవి ఒకప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమాతో యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని ఒక ఊపు ఊపేసాడనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: