![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/ram-charan-allu-arjun-unfollow-social-media-fans-shockedc8536632-e8f7-4a4a-a42a-ee95625ff333-415x250.jpg)
గతంలో సాయి ధరంతేజ్ కూడా అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేయడంతో చాలామంది ఫైరయ్యారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే దారిలో వెళ్ళినట్లు కనిపిస్తోంది.కాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత అల్లు కుటుంబం మెగా కుటుంబాల మధ్య ఒక కోల్డ్ వార్ మొదలైనట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. అప్పటినుంచి అల్లు అర్జున్ ని సైతం మెగా అభిమానులే కాకుండా మెగా హీరోలు కూడా దూరం పెట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది.
అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు కూడా మెగా కుటుంబం నుంచి కేవలం నాగబాబు చిరంజీవి మాత్రమే వెళ్లి పరామర్శించారు రామ్ చరణ్ కానీ సాయి ధరంతేజ్ గాని మిగిలిన హీరోలు ఎవరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లలేదు. అలా అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఈ రెండు కుటుంబాల మధ్య మనస్పర్ధలు వచ్చాయని వినిపిస్తున్నాయి. ఇక అప్పుడప్పుడు చిరంజీవి తన మేనల్లుడు అల్లు అర్జున్ పైన పలు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు కానీ.. తమ మధ్య విభేదాలు లేవనే విషయం పైన మాట్లాడలేదు. అల్లు అరవింద్ కూడా అంతే ఇటీవలే మేనల్లుడు విషయంలో తక్కువ చేసి మాట్లాడాలని విషయం మెగా అభిమానులకు నచ్చకపోవడంతో వారందరికీ కూడా సారీ చెప్పారు.