![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/shobitha-dhulipala93c53f8c-1ef4-4826-b3df-274c4e217dc0-415x250.jpg)
హైదరాబాద్ లో నిర్వహించిన వేడుకలో కింగ్ నాగార్జున - స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్.. ముఖ్య అతిథులుగా హాజరై నాగచైతన్యకు బెస్ట్ విషెస్ అందించారు . అంతేకాదు ఈ ఫంక్షన్ లో శోభితా ధూళిపాల హైలెట్గా నిలిచింది . కాగా ఈవెంట్ కి తండేల్ చిత్ర యూనిట్ సభ్యులందరూ హాజరై బాగా ఎంజాయ్ చేశారు . ఇదే క్రమంలో స్టేజ్ పైకి వచ్చిన డైరెక్టర్ చందుమొండేటి శోభిత ధూళిపాలకు ఒక సందేశం ఇచ్చారు . ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.
చందు మొండేటి మాట్లాడుతూ.." ఫ్యూచర్లో నేను నాగచైతన్యతో ఒక హిస్టారికల్ మూవీ ని తెరకెక్కించాలి అనుకుంటున్నాను. గతంలో నాగేశ్వరరావు గారు తెనాలి రామకృష్ణ సినిమాలో ఏ విధంగా నటించారో అదే విధంగా నాగచైతరతో కూడా చేయించాలి అనుకుంటున్నాను. అలాంటి తరహా పాత్రలో చైతు మెరవాలి అంటే కచ్చితంగా ఆయనకు తెలుగు పై మంచి పట్టు ఉండాలి. ఆయన తెలుగు బాగా నేర్చుకోగలగాలి . శోభితకి తెలుగులో మంచి అవగాహన ఉంది . చాలా చక్కగా మాట్లాడుతుంది .అంత చక్కగా చైతు తెలుగు భాష మాట్లాడగలిగితే కచ్చితంగా హిస్టారికల్ నేపథ్యంలో ఒక సినిమాను ప్లాన్ చేద్దామంటూ చెప్పుకొచ్చారు".
దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది . ఇప్పుడు నాగచైతన్యని చులకనగా చేసినట్లు కొంతమంది మాట్లాడుతున్నారు . మరికొందరు పోయి పోయి శోభిర కే అలాంటి సజెషన్ ఇచ్చావా అంటూ ఘాటు ఘాటుగా ట్రెండ్ చేస్తున్నారు . ఎందుకో నాగచైతన్య - శోభిత ధూళిపాలను పెళ్లి చేసుకోవడం చాలా మంది అక్కినేని అభిమానులకి నచ్చలేదు . ఆ కారణంగానే నాగచైతన్య పక్కన ఆమెను చూస్తే మండిపడిపోతూ కామెంట్స్ చేస్తూ ఉంటారు..!