-  ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరియర్ స్టార్ట్ చేసి పలు సినిమాలకు పనిచేసింది. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్న చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా తన తండ్రి చిరంజీవి .. తన సోదరుడు రామ్ చరణ్ సినిమాలకు పనిచేస్తుంది. ఆ తర్వాత ఆమె నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్టైన్మెంట్ ప్రై. లి పేరుతో బ్యాన‌ర్ ను స్టార్ట్ చేసి వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేయ‌డం మొద‌లుపెట్టింది. ఓటీటీలో మొద‌టిగా త‌న ల‌క్ ను చెక్ చేసుకున్న సుస్మిత త‌ర్వాత సేనాపతి అనే సినిమాను నిర్మించింది. సేనాపతి సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. శ్రీదేవి శోభన్ బాబు పేరుతో మొదటిసారి థియేటర్ సినిమా నిర్మిస్తే అది యావరేజ్ కనిపించుకుంది. రీసెంట్గా పరువు అనే వెబ్ సిరీస్ నిర్మించిన సుస్మిత మంచి రెస్పాన్స్ అందుకుంది.


ఈ క్రమంలోనే సుస్మిత తన తండ్రి చిరంజీవికి హిట్ ఇచ్చేందుకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని రూట్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని కొన్నేళ్లుగా బాలయ్య సినిమాల వ్యవహారాల్లో అన్ని తానై చూస్తున్నారు. కథ ల‌ ఎంపిక దగ్గర నుంచి .. కథలో మార్పులు బాలయ్య కాస్ట్యూమ్స్ ఎంపిక చేయటం .. బాలయ్య ఆ కథకు తగినట్టు ఎలా స్టైలిష్ గా ఉండాలో చూడటం ఇవన్నీ తేజస్విని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చిరంజీవికి కూడా గత కొద్దిరోజులుగా సరైన హిట్ సినిమా పడటం లేదు. ఈ క్రమంలోనే ఎలాగైనా చిరంజీవికి హిట్టిచ్చేందుకు ఇప్పుడు తేజస్విని రూట్లోకి సుష్మిత కొణిదెల వచ్చినట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసే సినిమా కోసం సుస్మిత నిర్మాత సాహూ గారపాటితో కలిసి పనిచేస్తున్నట్టు రీసెంట్గా చిరంజీవి స్వయంగా వెల్లడించారు. అలాగే డైరెక్టర్ బాబి - మైత్రి మూవీ కాంబినేషన్లో నిర్మించే సినిమాలో కూడా సుస్మిత భాగం కానున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: