![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/urvashi-rautelaa8daed9b-3ed8-490d-b61a-f527ddaaf47a-415x250.jpg)
నటి ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ లో బాలయ్య బాబుతో కలిసి స్టెప్పులు వేసింది. వీరిద్దరూ కలిసి ఈ సాంగ్ లో చేసిన స్టెప్పులపై అనేక రకాల విమర్శలను ఎదుర్కొన్నారు. తాజాగా ఈ విమర్శలపై నటి ఊర్వశి ఓ ఇంటర్వ్యూలో వాటి గురించి మాట్లాడారు. ఆ పాటకు మేము రిహార్సల్స్ చేస్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు. అసలు సిగ్గు పడాల్సిన అవసరమేముంది అనిపించింది.
బాలయ్య బాబు అభిమానుల్ని అలరించడానికి కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ అలాంటి స్టెప్స్ డిజైన్ చేశాడని ఊర్వశి అన్నారు. కానీ డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయిన అనంతరం ఇలాంటి విమర్శలు వస్తాయని మేము అస్సలు అనుకోలేదని నటి ఊర్వశి రౌతేలా అన్నారు. ప్రస్తుతం ఊర్వసి చేసిన వాక్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు విమర్శలు వచ్చినప్పటికీ డాకు మహారాజ్ సినిమా భారీ విజయాన్ని అందుకొని మంచి కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా అనంతరం బాలయ్య బాబు అఖండ-2 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన అఖండ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ గా అఖండ-2ను తీస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందని అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.