ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో ఎంతోమంది మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఎన్నో సినిమాలలో నటించిన ఎన్టీఆర్ హిట్లు, ఫ్లాప్లు అనే తేడా లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఆగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ నుంచి తాజాగా వచ్చిన చిత్రం దేవర. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించారు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.


సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించారు. దేవర సినిమా పార్ట్ 2 కూడా తొందరలోనే రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభించనున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇదిలా ఉండగా... జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా రాబోతోంది. ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ అడవి నేపథ్యంలో తీయబోతున్నారు. మొదట ఆ సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించారట. ఈ సినిమా షూటింగ్ ను ఎన్టీఆర్ లేకుండానే నిర్వహించినట్లుగా తెలుస్తోంది.



ప్రస్తుతం ఎన్టీఆర్ వార్-2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ప్రశాంత్ నీల్ తీయబోయే సినిమాలో షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే ప్రశాంత నీల్ కేజిఎఫ్, కేజిఎఫ్-2లో ఎక్కడా కూడా చెట్లు, పుట్టలను చూపించలేదు. తన సినిమాలతో మరో ప్రపంచాన్ని చూపిస్తాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా అస్సలు అలా ఉండదట. కమర్షియల్ జానర్ అయినప్పటికీ హీరోయిజాన్ని వేరే లెవెల్ లో చూపించే సరికొత్త బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నట్లుగా సమాచారం అందుతుంది.


కాగా, ఈ సినిమా వచ్చే సంవత్సరం 2026లో రిలీజ్ కానున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అందరూ అడవి బాట పడుతున్నారు. మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా కూడా అడవి బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కనుంది. కాగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: