![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/suma86fe21f4-c59a-4ae8-8f45-f990cf009035-415x250.jpg)
కానీ కొన్ని కొన్ని అవి నెగటివ్గా వెళ్లిపోయాయి . మరీ ముఖ్యంగా చిరంజీవిని సుమ ఓ ప్రశ్న అడిగి ఆటపట్టించింది. " మీ తాత గారితో మీకున్న గుర్తున్న అనుభవాల గురించి చెప్పండి " అంటూ అడుగుతారు. అప్పుడే చిరంజీవి సరదాగా సమాధానం ఇస్తూ .." ఆయన మహా రసికుడే అండోయ్ ..ఇంట్లోనే ఇద్దరు ఉండేవారు . వీరిద్దరి మీద అలిగితే మూడో మహిళ దగ్గరికి వెళ్లేవాడు. ఇంకా నాలుగు అయిదు వాళ్లు కూడా ఉండేవారు ఏమో నాకు ఐడియా లేదు ..నాకు తెలియదు" అంటూ కూసింత టంగ్ స్లిప్ అయిన విధంగా కామెంట్స్ చేశారు .
ఈ మాటలకి సుమా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయింది. కానీ అక్కడ సిచువేషన్ కవర్ చేసింది నవ్వుతూ . ఆ మేటర్ నుంచి బయటకు వచ్చేసింది . అయితే సోషల్ మీడియాలో మాత్రం జనాలు చిరంజీవిని వదలడం లేదు . అంత పెద్ద స్థాయిలో ఉండే మెగాస్టార్ చిరంజీవి అంతమంది ముందు ఇలాంటి నీచమైన కామెంట్స్ ఎలా చేయగలడు . ఇది అసలు కామెడీనా..? టూ వల్గర్. జబర్దస్త్ వల్గర్ ను మించి పోయాడు అంటూ మాట్లాడుతున్నారు . కామెడీకి వల్గర్ కి మధ్య సన్న గీత ఉంటుంది అని అది ఎవరు దాటకూడదు అని.. చిరంజీవి లాంటి స్టార్ హీరో అలా దాటి ప్రవర్తించడం మాట్లాడడం చాలా చాలా దారుణం అంటూ చిరంజీవి పేరుని సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురి చేస్తున్నారు . దీనిపై చిరంజీవి ఎంత త్వరగా స్పందిస్తే అంత మేలు లేకపోతే ఆయన పేరు ఇంకా ట్రోలింగ్ కి గురి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి..!