తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి నితిన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి చాలా మూవీలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇకపోతే నితిన్ ఈ మధ్య కాలంలో వరుసగా అపజయలను ఎదుర్కొంటూ వస్తున్నాడు. కొంత కాలం క్రితం మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈయనకు బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ ఎదురయింది.

ఆఖరుగా నితిన్ "ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఇకపోతే ప్రస్తుతం మాత్రం ఈయన రాబిన్ హుడ్ , తమ్ముడు అనే రెండు సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. తమ్ముడు సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ విడుదల కు సంబంధించిన ఓ  క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం వారు ఈ సినిమాని ఈ సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాను ఈ సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని మే తొమ్మిదవ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలా సినిమాలతో నితిన్ తన సినిమాని పోటీని దించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: