![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/kingdom-65f2fb9d-5e9e-497c-8c59-c606345d43c7-415x250.jpg)
ఇక విజయ్ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో "వీడి 12" అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మొదటిసారిగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను కేరళలో చిత్రీకరించారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, VD12 సినిమా మార్చి 30వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. వీడీ 12 సినిమా టీజర్, టైటిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ తరుణంలోనే... సినిమాకు "కింగ్డమ్" అనే టైటిల్ ను ఖరారు చేశారు.
టీజర్ లో విజయ్ దేవరకొండ డైలాగ్స్, లుక్స్, మ్యూజిక్ అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ టీజర్ లో పోలీస్ అధికారికగా అలాగే....ఖైదీలాగా కనిపించాడు విజయ్. కాగా, కింగ్డమ్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో అయినా విజయ్ దేవరకొండ సక్సెస్ అందుకోవాలని తన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.