టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఈ మధ్య కాలంలో వరుస పెట్టి అపజయాలను ఎదుర్కొంటూ వస్తున్నాడు. తాజాగా ఈయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు టీజర్ను ఈ రోజు మూవీ బృందం వారు విడుదల చేశారు. ఈ మూవీ కి కింగ్డమ్ అనే టైటిల్ను మేకర్స్ ఖరారు చేస్తూ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు.

మూవీ టీజర్ అధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ టీజర్ కు విడుదల అయిన తర్వాత అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. చాలా కాలం నుండి ఈ సినిమాని తెలుగు తో పాటు తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ టీజర్ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వగా , తమిళ్ వర్షన్ కి సూర్య , హిందీ వర్షన్ కు రన్బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇక ఈ మూవీ యొక్క మలయాళ , కన్నడ భాషల టీజర్ లకి ఎవరు వాయిస్ ఓవర్ ఇస్తారు అనే ప్రశ్న జనాల్లో నెలకొంది. కానీ తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క టీజర్ ను కేవలం తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో మాత్రమే విడుదల చేశారు. ఇకపోతే గేమ్ చేంజర్ మూవీ బృందం వారు కూడా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ , పాటలు అనేక ప్రచార చిత్రాలను మొదట కేవలం తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో మాత్రమే విడుదల చేశారు. కానీ సినిమా విడుదలకు సమయం అతి దగ్గరకు వచ్చిన సమయంలో ఈ మూవీ కి సంబంధించిన కన్నడ , మలయాళ ప్రచార చిత్రాలను , పాటలను మేకర్స్ విడుదల చేశారు.

అలాగే ఈ సినిమాను కూడా కన్నడ , మలయాళ భాషల్లో కూడా విడుదల చేశారు. అదే ఫార్ములాను కింగ్డమ్ మూవీ యూనిట్ కూడా ఫాలో అయ్యేలా కనబడుతున్నాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd