![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/waw-prabash-fanski-bumper-offer-praktinchi-meackers1c230e47-7eb7-4960-8956-6559cf4f77d4-415x250.jpg)
తాజాగా ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాకి మేకర్స్ ఏకంగా ఆయనతో నటించే అవకాశాన్ని సైతం కల్పిస్తున్నామంటూ ఒక ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటనను కూడా తెలియజేయడం జరిగింది. స్పిరిట్ సినిమాలో నటించే అవకాశం అన్ని వయసుల వారికి కూడా కల్పించబోతున్నాం అంటూ తెలిపారు.అయితే థియేటర్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారు మాత్రమే అందుకు అర్హులు అంటూ వెల్లడించారు. అయితే ఇందుకు ఒక హెడ్ షార్ట్ తో పాటుగా పర్సనల్ ఫోటో షార్ట్ ని జత చేసి..spirit.bhadrakalipichtures@gmail.com పంపించాలని తెలిపారు.
ఎవరైనా ఇంట్రడక్షన్ వీడియోని సైతం రికార్డ్ చేసి ఈ ఈమెయిల్ కైనా పంపించవచ్చు అంటూ తెలియజేశారు. అందుకు సంబంధించిన ఒక పోస్ట్ కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నది.దీంతో ప్రభాస్ అభిమానుల సైతం అందుకు సిద్ధమవుతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ డైరెక్టర్ నుంచి వచ్చిన సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాయి. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు గతంలో ఎన్నడు లేని విధంగా స్పిరిట్ సినిమాలు కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.