![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/samanthad122b967-a33e-42bc-8393-369623c71be7-415x250.jpg)
తాను నటించిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్లుగా మారుతున్నాయి. అయినప్పటికీ విజయ్ ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా వరుస పెట్టి సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాను చేస్తున్నారు. వీడి 12 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా చిత్ర బృందం "కింగ్డమ్" అనే టైటిల్ ను రివీల్ చేశారు. అంతేకాకుండా టీజర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది.
ఈ టీజర్ లో విజయ్ డైలాగ్స్, మ్యూజిక్, స్టైల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ కి సినీ అభిమానులు ఎంతగానో ఆకర్షితులు అవుతున్నారు. కాగా, కింగ్డమ్ సినిమా మే 30వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టీజర్ చూసిన అనంతరం విజయ్ దేవరకొండ అభిమానులు ఈ సినిమా తప్పకుండా విజయాన్ని అందుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా... ఈ సినిమా టీజర్ చూసిన అనంతరం సినీ సెలబ్రిటీలు కొంతమంది విజయ్ దేవరకొండకు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ నటి సమంత టీజర్ చూసిన అనంతరం తనదైన స్టైల్ తో రియాక్ట్ అయింది. టీజర్ చూసి గూస్ బంప్స్ అంటూ సమంత కామెంట్ చేసింది. ఈ కామెంట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. విజయ్ దేవరకొండ, సమంత మంచి స్నేహితులు. వీరిద్దరి కాంబినేషన్లో ఖుషి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా అనంతరం వీరిద్దరి స్నేహం అలానే కొనసాగుతోంది.