![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/business_videos/anil-dil-raju3a022330-2458-460a-ad74-96c6d926708d-415x250.jpg)
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది అగ్ర దర్శకులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ఫుల్ గా వారి సినిమాలతో స్టార్ దర్శకుడిగా కొనసాగుతారు. అలాంటి వారిలో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒకరు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుసగా తాను దర్శకత్వం వహించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమాలన్నీ మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.
అతను దర్శకత్వం వహించిన సినిమాలు చూడడానికి జనాలు ఎంతగానో ఆసక్తిని చూపిస్తున్నారు. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి పెద్ద సంచలనాలే సృష్టించింది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సక్సెస్ అనంతరం అనిల్ రావిపూడి తన తదుపరి సినిమా ప్రాజెక్టును కోసం సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కథను కూడా రెడీ చేశారు. ఈ సినిమాలో హీరోగా చిరంజీవిని పెట్టి తీయాలని అనిల్ రావిపూడి అనుకుంటున్నారు. దీనికి చిరంజీవి కూడా ఓకే చెప్పారు. అయితే ఈ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించడం లేదు. చిరంజీవి పెద్ద కుమార్తె కొణిదెలా సుస్మిత - సాహూ గారపాటి నిర్మాతలగా వ్యవహరిస్తున్నారు. అనిల్ రావిపూడి ఇదివరకు తాను దర్శకత్వం వహించిన సినిమాలన్నీ దిల్ రాజు నిర్మాణ సంస్థలోనే చేశారు.
ఈ సారి మాత్రం దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించడం లేదు. అనిల్ చిరంజీవి కాంబినేషన్లో రాబోయే సినిమా 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారట. మరో పక్క దిల్ రాజు మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ శతమానం భవతి సినిమా సీక్వెల్ ను చేయాలని ప్లాన్ లో ఉన్నారట. అంటే వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా దిల్ రాజు వర్సెస్ అనిల్ రావిపూడి మధ్య పెద్ద ఎత్తున పోటీ జరుగుతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.