నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కిర్రిక్ పార్టీ అనే సినిమాతో తన కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా అనంతరం తెలుగులో చలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా తర్వాత రష్మిక తెలుగులో వరుసగా సినిమాలు చేసుకుంటూ అగ్ర హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.


ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించి నటిగా తనకు తాను గుర్తింపును సంపాదించుకుంది. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయింది. రష్మిక తనకంటూ మంచి స్థానాన్ని సంపాదించుకుంది. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో రష్మిక ఒకరిని చెప్పవచ్చు. యానిమల్ సినిమాతో ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో చెప్పనవసరం లేదు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 ది రూల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిన్నది శ్రీవల్లిగా ప్రతి ఒక్కరిని మెప్పించింది.


తన అద్భుతమైన యాక్టింగ్ తో ఎంతోమంది అభిమానులను తన వైపుకు తిప్పుకుంది. అయితే నటి రష్మిక మందన కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో 2017లో ఎంగేజ్మెంట్ జరుపుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కొంతకాలం ప్రేమలో ఉన్న అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. అయితే ఏమైందో తెలియదు 2018లో వీరి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు.


ఎంగేజ్మెంట్ తర్వాత రక్షిత్ శెట్టికి, రష్మిక మందనకు మధ్య పెద్ద గొడవ జరిగిందట. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారట. ఈ కారణం వల్లనే ఈ జంట వివాహం కూడా క్యాన్సిల్ అయిందట. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన అనంతరం రష్మిక ఏమాత్రం బాధపడకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ అగ్ర హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం రష్మిక రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ జంట వివాహం ఎప్పుడు జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: