తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించగా ... టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని జనవరి 14 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ విడుదల అయ్యి 29 రోజులు పూర్తి అయ్యింది.

ఇప్పటికీ కూడా ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి. ఇకపోతే విడుదల అయిన 29 వ రోజు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏకంగా 20 లక్షల కలెక్షన్లు వచ్చాయి. ఇక 29 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 131.08 కోట్ల షేర్ ... 212.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇకపోతే 29 వ రోజు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 25 లక్షల షేర్ ... 50 గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక 29 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 156.97 కోట్ల షేర్ ... 271.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. ఈ మూవీ.కి ప్రపంచ వ్యాప్తంగా 41.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మూవీ 42.50 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇక ఇప్పటికే ఈ సినిమా ఏకంగా 114.47 కోట్ల లాభాలను అందుకొని భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ లోని వెంకటేష్ , ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి నటనలకు , ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి అనిల్ రావిపూడి కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: