తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు  ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినవారే. ఆ ఒక్కొమెటెక్కుతూ అదృష్టం కలిసి వచ్చి హీరోగా నిలదొక్కుకున్నారు. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి స్టార్ హీరోగా మారిన వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రవితేజ.. ఈయన నటన పరంగా చాలా అద్భుతంగా చేస్తారని చెప్పవచ్చు.. ఏ పాత్రలో అయినా ఇట్టే దూరిపోయే ఘనుడు.. కామెడీ పాత్రలైనా, మాస్, లవ్, ఇలా ఎలాంటివైనా సరే రవితేజ అలవోకగా నటిస్తారు.. ఈ విధంగా   ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్నారు.. అయితే ఈ మధ్యకాలంలో ఆయన కాస్త డల్ అయ్యారని చెప్పవచ్చు.. రవితేజ ఏజ్ పెరిగిన కొద్దీ  ఫేస్, బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి.. ముఖ్యంగా ముఖం వాడిపోవడం  వంటివి కనిపిస్తున్నాయి. దీంతో ఆయనను అప్పట్లో చూసిన వారు ఇప్పుడు చూస్తే రవితేజ చాలా మారిపోయారని అంటున్నారు.. 

కట్ చేస్తే  రవితేజ హీరోగా మంచి పొజిషన్ లో ఉన్న సమయంలోనే ఒక హీరోయిన్ తో లవ్ లో పడ్డారట. ఆమెను పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారట.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు వివరాలు చూద్దాం.. రవితేజ  మీరాజాస్మిన్ కాంబోలో భద్ర సినిమా వచ్చి సూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలోనే రవితేజ ఆమెతో లవ్ లో పడ్డారట.. అంతేకాదు మీరాజాస్మిన్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని రవితేజ చూసుకుంటూ వచ్చారట.

ఆమె ఏ చిత్రాల్లో నటించాలి  ఎక్కడికి వెళ్లాలి, ఏం చేయాలనే విషయాలన్నీ రవితేజ చూసుకునేవారని అప్పట్లో వార్తలు అనేకం వచ్చాయి.. ఈ విధంగా రవితేజ కండిషన్లు మితిమీరిపోవడంతో  మీరాజాస్మిన్ తట్టుకోలేక ఆయనను వద్దు బాబోయ్ అని వదిలేసిందని అప్పట్లో వార్తలు వినిపించాయి.. ఇలా వీరిద్దరిపై ఎన్ని వార్తలు వచ్చినా  వారు మాత్రం స్పందించకుండా ఎవరి పని వారు చూసుకున్నారు. అలా కొన్నాళ్లపాటు వీరి ప్రేమ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి కొట్టి చివరికి ఆగిపోయాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: